- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rs 10 Coins: రూ.10 కాయిన్స్‌పై కేంద్రం కీలక అప్‌డేట్.. లోక్‌సభలో ఏం చెప్పిందంటే?
Rs 10 Coins in India: ఈ మధ్య కాలంలో కరెన్సీ నోట్లు, నాణేలు రద్దు చేస్తున్నారన్న ప్రకటనలు, వార్తలు వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: Rs 10 Coins in India: ఈ మధ్య కాలంలో కరెన్సీ నోట్లు, నాణేలు రద్దు చేస్తున్నారన్న ప్రకటనలు, వార్తలు వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిలో నిజనిజాలు తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రూ. 10 నాణేలు తీసుకోవడానికి జనం వెనకాడుతుంటారు. అవి చెల్లుతాయో లేవోనన్న అనుమానులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిని నిలిపివేస్తున్నారన్న వార్తలు మరోసారి ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ నెలలో పెద్ద నోట్లుగా ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రూ. 2000నోటుతోపాటు సరికొత్త డిజైన్ లో రూ. 500 నోట్లను తీసుకువచ్చింది. ఇలా పలుమార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తనోట్లు, కొత్త కాయిన్స్ ముద్రిస్తుంటుంది. 2023 మే నెలలో రూ. 2000 నోట్లను కూడా ఉపసంహరించుకుంది. ఇప్పటికీ దానిని మాత్రం రద్దు చేయలేదు. ఇంకా ఇవి చెల్లుబాటులోనే ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రస్తుతం ఎక్కువగా రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల నాణేలు చలామణీలో ఉన్నప్పటికీ రూ. 10 నాణేలపై జనంలో సందేహం ఎక్కువగా ఉంది.
సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రూ. 10 రూపాయల నాణేలు, 20 రూపాయల నాణేలు, నోట్లు నిలిపివేస్తున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా రూ. 10 నాణెంపై ఎప్పటి నుంచో ఇదే వాదన కొనసాగుతోంది. ఇది చెల్లుబాటులోనే ఉన్నప్పటికీ..చాలామంది ఇప్పటికీ వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. జనాలను చైతన్యం చేసేందుకు రూ. 10 నాణేలు చెల్లుబాటు అవుతాయని..తీసుకుని వారిపై ఫిర్యాదు చేయొచ్చని స్వయంగా ఆర్బిఐ కూడా దిగివచ్చింది. అయినా కూడా ఇది పూర్తి స్థాయిలో జనాలకు చేరలేదు.
అందుకే ఇప్పుడు మరోసారి అవే వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలు జనం నమ్మే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం ఎన్ని రూ. 10 నోట్లు, నాణేలు చలామణిలో ఉన్నాయన్న సమాచారాన్ని లోకసభ సభ్యుడు ఒకరు అడిగారు. దానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
మన దేశంలో రూ. 10 నాణేలు, రూ. 20నోట్లు చెల్లుబాటులోనే ఉన్నాయని పేర్కొంది. 2024 డిసెంబర్ 31 నాటికి మార్కెట్లో 2,52,886 లక్షల 10 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. వీటి విలువ రూ. 25, 289 కోట్లు అని తెలిపింది. ఇప్పటికీ దేశంలో 79,502 లక్షల 10 రూపాయల నాణేలు మార్కెట్లో ఉన్నాయని.. వీటి విలువ రూ. 7950కోట్లని తెలిపింది. ఇదే సమయంలో చలామణిలో రూ. 10,20నోట్లు తగ్గుతున్నాయి. వీటి ముద్రణ ఆపేశారా అని అడిగిన ప్రశ్నకు..ఈ ముద్రణపై ఎలాంటి నిషేధం లేదని ముద్రణ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.






