Elon Musk : భవిష్యత్తు అంతా రోబో సర్జన్లదే హవా : ఎలాన్ మస్క్

by Muthe.Rajitha |

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌(Elon Musk) తన సంస్థలైన టెస్లా(Tesla), స్పేస్‌ఎక్స్‌(SpaceX), న్యూరాలింక్‌, ఎక్స్‌ఏఐ ద్వారా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నట్టు ప్రకటించారు.

Elon Musk : భవిష్యత్తు అంతా రోబో సర్జన్లదే హవా : ఎలాన్ మస్క్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌(Elon Musk) తన సంస్థలైన టెస్లా(Tesla), స్పేస్‌ఎక్స్‌(SpaceX), న్యూరాలింక్‌, ఎక్స్‌ఏఐ ద్వారా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా మస్క్.. AI, రోబోటిక్స్‌, మానవ మెదడు-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదేళ్లలో రోబోట్లు వరల్డ్ బెస్ట్ సర్జన్లను మించిపోతాయని అన్నారు. న్యూరాలింక్‌ సంస్థ మెదడులో ఎలక్ట్రోడ్‌లను అమర్చడానికి రోబోట్‌ను ఉపయోగిస్తోందని.. ఇది మానవ చేతులతో సాధ్యం కాని వేగం, ఖచ్చితత్వాన్ని సాధిస్తుందన్నారు.

ఈ రోబోట్‌ సన్నని "థ్రెడ్స్"ను మెదడు న్యూరాన్‌ల దగ్గర అమర్చి, సంకేతాలను N1 సెన్సార్‌కు పంపుతుంది. ఈ సాంకేతికత మెదడులో అతి సూక్ష్మ గాయాలు, దృష్టిలోపం, పక్షవాతం చికిత్సలో విప్లవం తీసుకురాగలదని తెలియజేశారు. ఇక ఏఐ, రోబోట్లరాకతో చాలా ఉద్యోగాలు పోతాయని లేదా ఉద్యోగాలు ఐచ్ఛికంగా మారతాయని అన్నారు. "హాబీలా ఉద్యోగం చేయాలనుకుంటే చేయవచ్చు, లేకపోతే ఏఐ, రోబోట్లు అన్నీ అందిస్తాయి" అని మస్క్ పేర్కొన్నారు.

Next Story