సామాన్యులకు వంటింటి ధరల మంట.. భారీగా పెరిగిన ఇంటి భోజనం ఖర్చు.. ఎంతంటే?

by D.Reddy |
సామాన్యులకు వంటింటి ధరల మంట.. భారీగా పెరిగిన ఇంటి భోజనం ఖర్చు.. ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు (Prices) సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా వంటగ్యాస్‌ మొదలు, బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు, చికెన్ ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. దీంతో ఇంట్లో వండుకునే భోజనం (Home cooked meals) ఖర్చు కూడా ప్రియంగా మారింది.

క్రిసిల్ నివేదిక ప్రకారం.. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ఇంట్లో వండుకునే శాకాహార భోజనం ధర రూ.28 నుంచి రూ.28.70 పెరిగింది. ఈ ఏడాది బంగాళాదుంపల ధర 35%, పప్పుల ధర 7%, వెజిటబుల్‌ ఆయిల్స్‌ ధర 17% పెరగడం ఇందుకు కారణం అని నివేదిక పేర్కొంది. అయితే, 2024 డిసెంబరు నాటి రూ.31.6 ధరతో పోలిస్తే.. గత నెలలో ఖర్చు తగ్గింది. నెలవారీగా టమోటాల ధర 34%, బంగాళాదుంపల ధర 16%, ఉల్లిపాయల ధర 21% తగ్గాయి.

ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే.. మాంసాహార థాలీ ప్లేటు ధర ఏడాది వ్యవధిలో రూ.52 నుంచి రూ.60.6కు చేరింది. మొత్తం మాంసాహార ఖర్చులో 50 శాతం వాటా ఉండే బ్రాయిలర్‌ చికెన్‌ ధర 33% పెరగడమే ఇందుకు కారణంగా క్రిసిల్ నివేదిక పేర్కొంది. అయితే 2024 డిసెంబరులో మాంసాహార భోజన ధర రూ.63.3తో పోలిస్తే, జనవరిలో తగ్గింది.

Next Story

Most Viewed