కోకా-కోలా కంపెనీ కొత్త సీఈవోగా హెన్రిక్ బ్రాన్.. ఆమోదించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్

by Kema Shiva Kumar |

వరల్డ్ ఫేమస్ బేవరేజ్ దిగ్గజం ది కోకా-కోలా (The Coca-Cola) కంపెనీ కొత్త సీఈవోగా హెన్రిక్ బ్రాన్ (Henrik Braun) నియమితులయ్యారు.

కోకా-కోలా కంపెనీ కొత్త సీఈవోగా హెన్రిక్ బ్రాన్.. ఆమోదించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ఫేమస్ బేవరేజ్ దిగ్గజం ది కోకా-కోలా (The Coca-Cola) కంపెనీ కొత్త సీఈవోగా హెన్రిక్ బ్రాన్ (Henrik Braun) నియమితులయ్యారు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హెన్రిక్ బ్రాన్ ఇదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 1996లో కోకా-కోలా కంపెనీలో చేరిన హెన్రిక్ బ్రాన్ లాటిన్ అమెరికా, బ్రెజిల్, గ్రేటర్ చైనా, సౌత్ కొరియా వంటి ప్రాంతాల్లో అనేక కీలక పదవుల్లో కొనసాగారు. కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్‌ను కూడా పర్యవేక్షించిన అనుభవం ఆయనకు ఉంది.

ప్రస్తుత సీఈవో జేమ్స్ క్విన్సీ (James Quincy) 2017 నుంచి కంపెనీని నడిపిస్తూ, జీరో-షుగర్ పానీయాలు, ఆరోగ్యకరమైన ఆప్షన్లపై దృష్టి సారించి కంపెనీని ‘టోటల్ బెవరేజ్ కంపెనీ’గా మార్చారు. ఆయన హయాంలో కంపెనీ స్టాక్స్ 63 శాతం పెరిగాయి. ఇక 2026 మార్చి 31 నుంచి జేమ్స్ క్విన్సీ కోకా-కోలా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ అవకాశాలు అన్వేషించడం, కస్టమర్ అవసరాలకు తగ్గట్టు ప్రాడక్ట్స్ రూపొందించడం, టెక్నాలజీని ఉపయోగించి బిజినెస్ పెర్ఫార్మెన్స్ పెంచడం వంటి సవాళ్లు కొత్త సీఈవో హెన్రిక్ బ్రాన్‌పై ఉన్నాయి.

Next Story