- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో మరో మూడు యాపిల్ స్టోర్లు.. ఈ సారి ఎక్కడంటే!
ఇటీవల ఘనంగా భారత్‌లో కొత్తగా రెండు అధికారిక స్టోర్లను ప్రారంభించిన యాపిల్ కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఘనంగా భారత్‌లో కొత్తగా రెండు అధికారిక స్టోర్లను ప్రారంభించిన యాపిల్ కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా ఫసిపిక్ ప్రాంతంలోని భారత్‌తో పాటు చైనా, ఇతర దేశాల్లో కొత్తగా 15 స్టోర్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని యాపిల్ కంపెనీకి చెందిన ఉన్నతోద్యోగి ఒకరు పేర్కొన్నారు. యాపిల్ కంపెనీ ఇండియాలో మరో మూడు స్టోర్లను ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంది.
ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో రెండు స్టోర్లను ప్రారంభించగా మూడో దాన్ని 2025 నాటికి ముంబైలోని సబర్బన్‌లోని బోరివాలి ప్రాంతలో ఏర్పాటు చేయనుంది. అలాగే నాలుగో స్టోర్‌ను ఢిల్లీలోని డీఎల్‌ఫ్ ప్రోమెనేడ్ మాల్‌లో 2026 నాటికి ఓపెన్ చేయనుంది. ఐదో స్టోర్‌ను ముంబైలోని వ్రోలి ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. అమెరికా తరువాత భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా కంపెనీ ఈ కొత్త స్టోర్లను ప్రారంభించనుంది.






