Tesla Robot: భారత్‌కు టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్

by S Gopi |   (  Updated:2026-04-22 17:25:43  IST  )

హ్యూమనాయిడ్ రోబోట్‌తో పాటు టెస్లా ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ సొల్యూషన్ వ్యాపారాన్ని కూడా భవిష్యత్తులో భారత్‌లోకి తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు

Tesla Robot: భారత్‌కు టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన ఈవీ దిగ్గజం టెస్లా భారత్‌కు సంబంధించి తన దీర్ఘకాల ప్రణాళికలను మరింత స్పష్టంగా తెలియజేసింది. సంస్థ హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌ను సరైన సమయంలో భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. టెస్లా ఏపీఏసీ చీఫ్ ఇసాబెల్ ఫాన్ మాట్లాడుతూ.. హ్యూమనాయిడ్ రోబోట్‌తో పాటు టెస్లా ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ సొల్యూషన్ వ్యాపారాన్ని కూడా భవిష్యత్తులో భారత్‌లోకి తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఏడాది చివర్లో అమెరికాలో దీని భారీ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఈ హ్యూమనాయిడ్ రోబోట్లు రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా ప్రమాదకర పనులు, ఇంట్లో సాయం అందించడం, ప్రాథమిక వైద్య సహాయం వంటి విభాగాల్లో ఉపయోగపడతాయని టెస్లా భావిస్తోంది. ఇక, ఇంధన రంగానికి సంబంధించి టెస్లా భారత్‌ను ముఖ్యమైన మార్కెట్‌గా చూస్తోంది. సౌరశక్తి, పవర్ స్టోరేజ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి పరిష్కారాలను అందించే సంస్థగా టెస్లా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తోంది. వాణిజ్య అవసరాల కోసం మెగాప్యాక్ స్టోరేజ్, గృహ అవసరాల కోసం పవర్‌వాల్ వంటి ఉత్పత్తులను సరైన సమయంలో భారత్‌లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సంస్థ పేర్కొంది.

Read More..

SHOCKING: హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీ కేంద్రం.. రూ.17 కోట్ల విలువైన సరుకు సీజ్‌

Next Story