SHOCKING: హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీ కేంద్రం.. రూ.17 కోట్ల విలువైన సరుకు సీజ్‌

by Gantepaka Srikanth |

రాజధాని నగరంలో మాదకద్రవ్యాల కట్టడిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు.

SHOCKING: హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీ కేంద్రం.. రూ.17 కోట్ల విలువైన సరుకు సీజ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని నగరంలో మాదకద్రవ్యాల కట్టడిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. మౌలాలి పారిశ్రామిక వాడ (IDA) కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్ తయారీ కేంద్రాన్ని అధికారులు ఛేదించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 17.40 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పారిశ్రామిక యూనిట్ ముసుగులో ఇక్కడ ప్రమాదకరమైన డ్రగ్‌ను అక్రమంగా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో భారీగా డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ అక్రమ దందాతో సంబంధం ఉన్న ఒక కెమిస్ట్, ముడి పదార్థాలను సరఫరా చేసే వ్యక్తి, డ్రగ్ రిసీవర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేశారు. నగర నడిబొడ్డున పారిశ్రామిక వాడల ముసుగులో జరుగుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచామని ఎన్‌సీబీ అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story