Tesla: ఆగష్టు 11న టెస్లా రెండో షోరూమ్‌ ప్రారంభం

by S Gopi |

దేశ రాజధానిలో కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో కంపెనీ షోరూమ్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేస్తోంది.

Tesla: ఆగష్టు 11న టెస్లా రెండో షోరూమ్‌ ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన ఈవీ బ్రాండ్ టెస్లా భారత్‌లో తన రెండో షోరూమ్‌ను మరో వారం రోజుల్లో ప్రారంభించనుంది. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న వరల్డ్‌మార్క్ 3 వద్ద కంపెనీ స్టోర్ ఏర్పాటు చేస్తోంది. టెస్లా గత నెలలోనే ముంబైలో తన మొదటి స్టోర్‌తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో కంపెనీ షోరూమ్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం కంపెనీ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో తమ మొదటి ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లో నాలుగు వీ4 సూప్రర్ ఛార్జింగ్ స్టాల్స్(డీసీ ఛార్జింగ్), నాలుగు డెస్టినేషన్ ఛార్జింగ్ స్టాల్స్(ఏసీ ఛార్జింగ్) ఉంటాయి. కాగా, భారత మార్కెట్లో టెస్లా తన మోడల్ వై ఈవీ కారును రెండు వెర్షన్‌లలో లాంచ్ చేసింది. రియర్-వీల్ డ్రైవ్ మోడల్ ధర రూ. 60.1 లక్షలు, లాంగ్-రేంజ్ వేరియంట్ రూ. 67.8 లక్షలుగా నిర్ణయించింది.

Next Story