టెస్లా కారా.. మజాకా.. సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఎలా వెళ్లిందో చూడండి

by Naga Rani Yarlagadda |

పూర్తిగా డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ తో నడిచే డ్రీమ్ కారును టెస్లా (Tesla) అందరి ముందుకు తీసుకొచ్చింది.

టెస్లా కారా.. మజాకా.. సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఎలా వెళ్లిందో చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: పూర్తిగా డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ తో నడిచే డ్రీమ్ కారును టెస్లా (Tesla) అందరి ముందుకు తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన టెస్లా సంస్థ తమ మొట్టమొదటి పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కారును (Self Driving Car) విజయవంతంగా పరీక్షించి వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. మనిషి అవసరం లేకుండా కారు ఫ్యాక్టరీ నుంచి యజమాని ఇంటి వరకు వెళ్లడం ఇదే మొదటిసారి.

'టెస్లా మోడల్ వై'గా పేరొందిన ఈ కారు.. ట్రాఫిక్‌ సిగ్నల్స్, మలుపులు, ఇతర వాహనాల మధ్య వేగాన్ని సమన్వయం చేస్తూ కేవలం 30 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంది. ఎలాంటి రిమోట్‌ కంట్రోల్‌ లేకుండా, లోపల ఎవరూ లేకుండా, ఈ ప్రయాణం పూర్తిగా ఆటోమేటిక్‌ అని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తెలిపారు. ఈ వీడియోను ఆయన ఎక్స్ (X)లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.

టెస్లా ఏఐ విభాగం (Tesla AI Department) వైస్ ప్రెసిడెంట్ అశోక్ ఎల్లుస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారు గంటకు 115 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది. జూన్ 22న టెస్లా ఆస్టిన్‌లో రోబోట్యాక్సీ ప్రయోగాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు టెస్లా మోడల్ వైలో ప్రయాణించే అవకాశం ఇచ్చింది. రాబోయే రోజుల్లో లక్షలాది రోబోట్యాక్సీలను రోడ్లపైకి తీసుకురావడం టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.

సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన కారు..

Next Story