Tesla India: ముంబైలోని కుర్లాలో రెండు ఫ్లోర్లు లీజుకు తీసుకున్న టెస్లా

by S Gopi |

ఒప్పందంలో భాగంగా బిల్డింగ్ 1 గ్రౌండ్ ఫ్లోర్‌లోని యూనిట్ జీ-101, జీ-102లను రిటైల్ షోరూమ్‌ కోసం తీసుకున్నారు.

Tesla India: ముంబైలోని కుర్లాలో రెండు ఫ్లోర్లు లీజుకు తీసుకున్న టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలంగా భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలని చూస్తున్న గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా దానికోసం వేగంగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రీమియం కమర్షియల్ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం, ముంబైలోని కుర్లా వెస్ట్‌లో ఉన్న లోధా లాజిస్టిక్స్ పార్క్‌లో 24,565 చదరపు అడుగుల స్థలం కోసం బెల్లిస్సిమో-సిటీ ఎఫ్‌సీ ముంబై 1 ప్రైవేట్ లిమిటెడ్‌తో లీజు ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో భాగంగా బిల్డింగ్ 1 గ్రౌండ్ ఫ్లోర్‌లోని యూనిట్ జీ-101, జీ-102లను రిటైల్ షోరూమ్‌ కోసం తీసుకున్నారు. ఇది 20 ప్రత్యేక కార్ పార్కింగ్ స్లాట్‌లతో వస్తుంది. ఈ లీజు ఐదేళ్ల కాలనికి తీసుకున్న ఈ లీజు కింద టెస్లా ఇండియా నెలకు రూ. 37.53 లక్షలు చెల్లించనుంది. అంటే చదరపు అడుగుకు రూ. 153 టెస్లా చెల్లిస్తోంది. ప్రతి ఏడాది అద్దె 5 శాతం పెంచుకునేందుకు లీజులో ఒప్పందం చేసుకున్నారు. అలాగే, కామన్ ఏరియా మెయింటెనెన్స్(సీఏఎం) ఛార్జీలు చదరపు అడుగుకు రూ. 10గా నిర్ణయించారు. ఇది కూడా ఏడాదికి 5 శాతం పెంచనున్నారు. ఈ స్థలాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఉత్పత్తులు, సేవలు, అమ్మకాలు, డెలివరీ వ్యాపారం కోసం ఉపయోగించనున్నట్టు సీఆర్ఈ మ్యాట్రిక్స్ పేర్కొంది.

ఢిల్లీలోనూ ఒక షోరూమ్?

దీంతో టెస్లా భారత్‌లో లీజుకు తీసుకున్న మూడో స్థలం ఇదేనని స్పష్టమవుతోంది. ఇదివరకు 2023, అక్టోబర్‌లోనూ పూణేలోని విమన్ నగర్‌లో పన్‌శిల్ బిజిఎస్ పార్క్‌లో 5,850 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ. 11.65 లక్షలతో లీజుకు తీసుకుంది. ఇది కూడా ఐదేళ్లా కాలానికి, 5 శాతం వార్షిక పెంపుతో ఒప్పందం చేసుకుంది. ముంబైలోనే బాంద్రా కులా కాంప్లెక్స్‌లో మొదటి షోరూమ్ కొసం ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ స్థలాన్ని అత్యధిక మొత్తానికి లీజుకు తీసుకున్నట్టు సమాచారం. ఇక, దేశ రాజధాని ఢిల్లీలోని ఏరోసిటీలోనూ మరో షోరూమ్ ప్రారంబించాలని టెస్లా భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతునాయి.

Next Story