- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Elon Musk: టెలిగ్రామ్‌లో గ్రోక్ ఏఐ చాట్‌బాట్
దీని ద్వారా టెలిగ్రామ్‌లో గ్రో చాట్‌బాట్ కూడా అందుబాటులోకి రానుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ తన చాట్‌బాట్ గ్రోక్‌ను మరింత అగ్రెసివ్‌గా విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం తన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు 300 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 2,500 కోట్లకు పైనే) చెల్లించారు. దీని ద్వారా టెలిగ్రామ్‌లో గ్రో చాట్‌బాట్ కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే టెలిగ్రామ్‌కు 100 కోట్ల కంటే ఎక్కువ మంది కస్టమర్లు ఉండటంతో గ్రోక్ విస్తరణకు, మరింత మందికి చేరువయ్యేందుకు వీలుంటుందని ఎలన్ మస్క్ కంపెనీ ఆశిస్తోంది. అంతేకాకుండా కీలకమైన ఏఐ మార్కెట్లో మరింత సమర్థవంతమైన పోటీ ఇవ్వాలనే లక్ష్యం నెరవేరుతుందని ఎక్స్ఏఐ భావిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎక్స్ఏఈ ద్వారా వచ్చే సబ్‌స్క్ర్పిషన్ అమ్మకాల్లో సగం టెలిగ్రామ్‌కు ఇవ్వనుంది. దీనికి అదనంగానే నగదు, స్టాక్ రూపంలో 300 మిలియన్ డాలర్ల చెల్లింపు జరుగుతుందని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పవెల్ దురోవ్ బుధవారం సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందం వారా ఎక్స్ఐ విలువ 33 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2024 ప్రారంభంలో ఎక్స్ఏఐను ఎలన్ మస్క్‌కు చెందిన ఎక్స్ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.






