అతి త్వరలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్? నిషేధానికి కారణాలు ఇవే!

by Geesa Chandu |   (  Updated:2024-08-30 20:08:15  IST  )

భారత్ లో టెలిగ్రాం యాప్.. అతి త్వరలోనే బ్యాన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్? నిషేధానికి కారణాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో టెలిగ్రాం యాప్.. అతి త్వరలోనే బ్యాన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి, భారత్ కి చెందిన సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ విచారణను కూడా చేపట్టింది. అయితే రెండ్రోజుల క్రితమే టెలిగ్రాం యాప్ సీఈవో 'పావెల్' ను అరెస్ట్ చేయడంతో.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ, ఈ టెలిగ్రాం యాప్ ను బ్యాన్ చేయాలనే ఆలోచనలో పడ్డాయి. మరి ఈ యాప్ ను ప్రస్తుతం ఎందుకు బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు.? తదితర కారణాలను ఒకసారి చూస్తే..

టెలిగ్రాం నిషేధానికి ప్రధాన కారణాలు ఇవే..

  • సెన్సార్ లేకుండా విద్వేష ప్రసంగాలు ఉండటం: టెలిగ్రాం లో వచ్చే అనేక రకాల వీడియోలకు సెన్సార్ అనేదే లేదు, తద్వారా నియంత్రణ లేకుండా పోయింది. ఈ యాప్ ను సామాజిక కోణంలో చూస్తే.. యాప్ నిర్వహణ సరిగా లేదు. రెచ్చగొట్టే విధంగా విద్వేష ప్రసంగాలు, దాని వల్ల కలిగే అనర్ధాలు, అల్లర్లు వంటి వీడియోలు ఈ యాప్ లో యథావిధిగా రావటం. దీని వల్ల నేరుగా హింసను ప్రేరేపించినట్లు అవుతుంది.
  • టెర్రరిస్టులకు అడ్డాగా మారింది: టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు, యాక్షన్ ప్లాన్ లు, కమ్యూనికేషన్స్ మొత్తం ఈ యాప్ ద్వారానే కొనసాగిస్తున్నట్లు విచారణ సంస్థలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక టెర్రరిస్టు సంస్థలకు టెలిగ్రాం అడ్డాగా మారింది.
  • అశ్లీలతకు, హనీ ట్రాప్ కు కూడా అడ్డాగా టెలిగ్రాం: ఈ యాప్ లో ఎక్కువగా అశ్లీలత, చైల్డ్ పోర్న్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు సైబర్ క్రైమ్ సెంటర్ నిర్ధారణకు వచ్చింది. ఇంకా మహిళల అక్రమ రవాణా, హనీ ట్రాప్ కు ఈ యాప్ అడ్డాగా మారింది. ఈ యాప్ లో భారత్ తో పాటు పలు దేశాల చట్టాలకు విరుద్ధంగా కంటెంట్ ఉండటం.
  • అన్ని రకాల పరీక్ష పేపర్ల లీక్: ఇటీవలే భారత్ లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మొత్తం ఈ యాప్ ద్వారానే బయటపడింది.లీక్ అయిన నీట్ పేపర్ ఈ యాప్ ద్వారానే షేర్ చేయబడింది. ఇంకా హర్యానా, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలలో నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో కూడా టెలిగ్రాం యాప్ కీలకంగా మారినట్లు విచారణ సంస్థ నిర్ధారించింది.
  • సినిమా, ఇతర పైరేటెడ్ కంటెంట్: అన్ని సినిమాలకు సంబంధించిన వీడియోల లింక్స్, నిమిషాల్లోనే ఈ యాప్ లోకి షేర్ చేయబబడేవి. దీంతో పాటు మ్యూజిక్, సాఫ్ట్ వేర్ ఈ-బుక్స్, ప్రభుత్వాలు బ్యాన్ చేసిన వెబ్ లినక్స్ సైతం ఈ యాప్ ద్వారా షేర్ చేయబడేవి.

ఇలా.. అనేక రకాల నిషేదిత అంశాలు గల కంటెంట్ ఈ యాప్ లో కొనసాగుతున్నట్లు భారత సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ నిర్ధారించింది. అందువల్లే ఈ యాప్ ను భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా బ్యాన్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story