Telecom Companies: ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన బకాయి రూ. 1.77 లక్షల కోట్లు

by S Gopi |

వొడాఫోన్ ఐడియాకు చెందిన 2006--07 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఏజీఆర్ బకాయిలు రూ. 87,695 కోట్లను ఫ్రీజ్ చేశారు.

Telecom Companies: ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన బకాయి రూ. 1.77 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి భారత ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిలు రూ. 1.77 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఈ మేరకు అధికారిక డేటా వివరాలను ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. దీని ప్రకారం, అప్పుల ఊబిలో ఉన్న ప్రైవేట్ రంగ వొడాఫోన్ ఐడియా (వీఐ) మొత్తం రూ. 89,952 కోట్లు, భారతీ గ్రూప్‌ రూ. 51,091 కోట్లు, టాటా గ్రూప్‌పై రూ. 20,426 కోట్లు, ఎంటీఎన్ఎల్‌పై రూ. 14,462 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌పై రూ. 1,984 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. ఇందులో వొడాఫోన్ ఐడియాకు చెందిన 2006--07 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఏజీఆర్ బకాయిలు రూ. 87,695 కోట్లను ఫ్రీజ్ చేశారు. అంటే, చెల్లింపు ప్రక్రియ వాయిదాలో ఉంది. దీనికి సంబంధించి వీఐ బకాయిలను పునఃపరిశీలన కోసం జనవరి 30న టెలికాం విభాగం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. ఈ కమిటీలో భారత ప్రభుత్వానికి చెందిన రిటైర్‌మెంట్ కార్యదర్శి స్థాయి అధికారి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నామినేట్ చేసిన ఓ ప్రతినిధి ఉంటారు. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయమే తుది ఫలితం కానుంది. అందుకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

Next Story