- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bank Services: వామ్మో.. వాయ్యో.. అకౌంట్‌లో నుంచి డబ్బులు రావాట్లేదు బాబోయ్.. 10 రోజులగా ఏం జరుగుతోంది?
Bank Services: బ్యాంకు ఖాతా (Bank account)ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: Bank Services: బ్యాంకు ఖాతా (Bank account)ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరూ ఆన్ లైన్(Online) బాట పట్టారు. డిజిటల్ పేమెంట్స్(Digital Payments) చేస్తున్నారు. ఫోన్ పే(PhonePe), గూగుల్ పే (Google Pay)వంటి వినియోగం కూడా చాలా ఎక్కువగానే ఉంది. వీటి వినియోగం వల్ల నగదు వాడటం అనేది చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పవచ్చు.
అయితే గ్రామాల్లో మాత్రం చాలా మంది డబ్బుల కోసం బ్యాంకు(Bank)లకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే బ్యాంక్ సేవల(Bank Services)కు అంతరాయం ఏర్పడితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆన్ లైన్ సేవలు(Online services) అయితే కొన్ని సందర్భాల్లో సతాయించినా మళ్లీ యాథావిథిగా పనిచేస్తుంటాయి. అయితే ఇక్కడ మాత్రం రోజులు గడుస్తున్నా కూడా సేవలు మాత్రం ఇంకా సతాయిస్తూనే ఉన్నాయి.
అది ఏ బ్యాంక్(Bank) అనే కదా మీ సందేహం. తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Gramin Bank). అందులో సర్వీసులకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దాదాపు 10 రోజుల నుంచి బ్యాంక్ లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో బ్యాంక్ లో అకౌంట్(Bank account) ఉన్నవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామాల నుంచి డబ్బులు విత్ డ్రా(Withdraw) చేసుకోవాలని వచ్చినవారు నిరాశతో వెనుదిగిరగాల్సి వస్తోంది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామీణ బ్యాంకులో ఈ పరిస్థితి నెలకొంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్(Technical problems) వల్ల ఖాతాలో డబ్బులు ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. రైతు భరోసా డబ్బులు(Farmer's insurance money) ఇప్పుడు రైతుల బ్యాంకు అకౌంట్లోనే జమ అవుతున్నాయి. దీంతో చాలా మంది బ్యాంకుకు వస్తున్నారు. అయితే సర్వీసులు అందుబాటులో లేకపోవడం వల్ల వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు.






