- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోర్టల్‌లో సాంకేతిక సమస్య.. ITR ఫైలింగ్‌కు గడువు నేటికి పెంపు
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పెనాలిటీలు లేకుండా ఐటీ రిటర్నులు (IT Returns) దాఖలు చేసేందుకు ఒక రోజు గడవు పెంచారు.

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పెనాలిటీలు లేకుండా ఐటీ రిటర్నులు (IT Returns) దాఖలు చేసేందుకు ఒక రోజు గడవును పెంచారు. అయితే, నిన్నటితోనే గడువు ముగియాల్సి ఉండగా.. మరోసారి నేటికి పొడిగిస్తున్నట్లుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. కాగా, సెప్టెంబరు 15 నాటికి దాదాపు రూ.7.3 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు కాగా.. ఇప్పటి వరకు రూ.4 కోట్లకు పైగా రిటర్నుల స్క్రూటినీ ప్రక్రియ పూర్తి అయనట్లుగా అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే భారీ ఎత్తున ఐటీ రిటర్నులు దాఖలు చేయగా.. పోర్టల్ (Portal)లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అధికారులు ఇవాళ ఒక్క రోజు ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు మరోసారి అవకాశం కల్పించారు. ఇవాళ కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేయని పక్షంలో సెక్షన్-234 (F) ప్రకారం లేటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.వెయ్యి, అంతకు మించి ఉంటే రూ.5 వేలు పెనాలిటీ చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 234 (A) ప్రకారం చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1 శాతం వడ్డీతో ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చు.






