- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCS: సెప్టెంబర్ 1 నుంచి టీసీఎస్ ఉద్యోగులకు వేతనాల పెంపు
హైక్ తీసుకునే వారిలో సీ3ఏ గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగులతో పాటు వీరిలో ఫ్రెషర్లు, మిడ్-లెవల్ ఉద్యోగులు ఉన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్ 1 నుంచి తన ఉద్యోగులకు వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని గురువారం ప్రకటించింది. హైక్ తీసుకునే వారిలో సీ3ఏ గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగులతో పాటు వీరిలో ఫ్రెషర్లు, దశాబ్ద కాలం అనుభవం ఉన్న మిడ్-లెవల్ ఉద్యోగులు ఉన్నారు. ఇటీవలే కంపెనీలోని 12,000 మందిని తొలగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో టీసీఎస్ నుంచి తాజా వేతన పెంపు ప్రకటన వెలువడటం గమనార్హం. దీనికి సంబంధించి టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్, సీహెచ్ఆర్ఓ కె సుదీప్ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా వేతన సవరణ గురించి తెలియజేశారు. సాధారణంగా వార్షిక వేతన సవరణ ఏప్రిల్‌లో జరుగుతుంది. వివిధ కారణాలతో టీసీఎస్ ఐదు నెలల ఆలస్యం పెంపు ప్రకటన చేసింది. ఎంతమేర జీతం పెంపు ఉంటుందనే అంశంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఉద్యోగుల పనితీరు, అనుభవం ఆధారంగా ఇది ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయంగా తొలగింపుల ప్రక్రియను సిద్ధం చేస్తోందని సీఈఓ కృతివాసన్ పేర్కొన్నారు.






