- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCS: రూ. 11 డివిడెండ్ ప్రకటించిన టీసీఎస్
టీసీఎస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) గురువారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ప్రకటనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలైంది. ఈ సందర్భంగా టీసీఎస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం, మధ్యంతర డివిడెండ్‌ను నవంబర్ 4న చెల్లించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్లు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ రూ. 12,075 కోట్ల నికర లాభాలను సాధించింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 1.4 శాతం అధికం. అలాగే, కార్యకలాపాల నుంచి వచ్చే నిర్వహణ ఆదాయం రూ. 65,799గా ఉంది, ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 64,259 కోట్ల కంటే 2.4 శాతం ఎక్కువని వివరించింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం క్షీణించినప్పటికీ, ఆదాయం పెరిగిందని కంపెనీ తెలిపింది. కాగా, త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గురువారం టీసీఎస్ షేర్ ధర 1 శాతం కంటే ఎక్కువగా పెరిగి రూ. 3,060.20 వద్ద ముగిసింది.






