TCS: కొత్త హెచ్-1బీ నియామకాలు చేపట్టే ఆలోచన లేదు: టీసీఎస్ సీఈఓ

by S Gopi |

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కొత్త హెచ్-1బీ నియామకాలను తీసుకునే ఆలోచన లేదని సీఈఓ కె కృతివాసన్ స్పష్టం చేశారు.

TCS: కొత్త హెచ్-1బీ నియామకాలు చేపట్టే ఆలోచన లేదు: టీసీఎస్ సీఈఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన అమెరికా నియామకాల వ్యూహంపై స్పష్టమైన వైఖరిని తీసుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కొత్త హెచ్-1బీ నియామకాలను తీసుకునే ఆలోచన లేదని సీఈఓ కె కృతివాసన్ స్పష్టం చేశారు. బదులుగా, స్థానికంగా(అమెరికా) ప్రతిభ ఉన్న ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి సారిస్తాం. ఇది వీసా ఆధారిత ఉద్యోగులపై ఆధారపడటం తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా తీసుకున్న నిర్ణయమని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో కంపెనీకి సుమారు 33 వేల మంది ఉద్యోగులుండగా, అందులో 11 వేల మంది వరకు హెచ్-1బీ ద్వారా వచ్చినవారు ఉన్నారు. ఈ ఏడాది కూడా కొత్తగా 500 మందిని హెచ్-1బీ వీసాల ద్వారా భారత్ నుంచి పంపించాం. కానీ ఇకపై ఈ వీసా కింద కొత్త ఉద్యోగులను నియమించాలని ప్రణాళిక లేదన్నారు. ఇదే సమయంలో ఉద్యోగాల తొలగింపు గురించి మాట్లాడిన కృతివాసన్.. భవిష్యత్తు కంపెనీ వృద్ధిని పరిగణలోకి తీసుకుని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే లేఆఫ్ చేపట్టినట్టు చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి సరైన ప్యాకేజీ ఇచ్చామని పేర్కొన్నారు.

Next Story