- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PPF Investment Rule: నెలకు లక్ష సంపాదించాలంటే మీరు PPFలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
Public Provident Fund Benefits: పీపీఎఫ్ స్కీమ్( Public Provident Scheme)లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ ప్లాన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: Public Provident Fund Benefits: పీపీఎఫ్ స్కీమ్( Public Provident Scheme)లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ ప్లాన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident Fund ) లో నెలకు లక్షల రూపాయలు పొందాలంటే ఎంత మొత్తం ఇన్వెస్ట్ (Investment)చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా రిటైర్మెంట్(Retirement) తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంటారు. అయితే మీరు కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని పెట్టుబడి పథకాలు ఉన్నాయి. ఈ జాబితాలో పీపీఎఫ్(PPF) కూడా ఉంది. మీరు ప్రతినెలా లక్ష రూపాయలకు పైగా రాబడి పొందాలనుకుంటే ..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( Public Provident Scheme) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండే సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఇది అధిక రాబడిని ఇవ్వడమే కాకుండా పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి మొత్తాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అంటే ఏమిటి?
భారత ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఎంపికను అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పొదుపు పథకం. ఇది ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును అందిస్తుంది. మీరు దీన్ని బ్యాంకు లేదా పోస్టాఫీసులో సులభంగా తెరవవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబడి పరిధి రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.
పీపీఎఫ్( Public Provident Scheme) ఖాతా లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. దీని తరువాత, మీరు దానిని 5-5 సంవత్సరాల బ్లాక్‌లలో మీ సౌలభ్యం ప్రకారం పెంచుకోవచ్చు. ఇది మీకు పెట్టుబడిపై పూర్తి నియంత్రణను ఇస్తుంది.
మన మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే.. PPFలో 15 సంవత్సరాల కాలానికి ముందు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చా లేదా? PPF ఖాతా నుండి పాక్షిక విత్ డ్రా ఎంపిక 5 సంవత్సరాల తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఒకసారి అందుబాటులో ఉంటుంది. ఒకవేళా మీరు కొత్త పెట్టుబడులు పెట్టినా చేయకపోయినా, 15 సంవత్సరాల తర్వాత కూడా ఖాతాను కొనసాగించవచ్చు.
PPF పై పన్ను ప్రయోజనాలు:
80C కింద PPF పై మీరు రూ. 1.50 లక్షల వరకు పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. ఎందుకంటే దాని వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి.
లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఎలా పొందాలి?
మీరు ప్రతి సంవత్సరం రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. దీనిని 15 సంవత్సరాలు కొనసాగించాల్సి ఉంటుంది. మీరు ఏప్రిల్ 1-5 మధ్య పెట్టుబడి పెట్టాలి. తద్వారా మీరు మొత్తం సంవత్సరానికి గరిష్ట వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ఖాతాను 5-5 సంవత్సరాల బ్లాక్‌లుగా పొడిగించి, పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. ఈ ప్రక్రియను 35 సంవత్సరాలు కొనసాగిస్తే.. 35 సంవత్సరాల తర్వాత మీకు ఎంత మొత్తం రూ. 2,26,97,857 మీ చేతికి అందుతుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ప్రస్తుతం 7.1శాతం వడ్డీ అందిస్తున్నారు. మీరు ఈ వడ్డీ రేటతో 15 లేదా 20ఏళ్లపాటు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలను అర్జించవచ్చు.






