1,000 మంది మహిళా ఇంజనీర్లను నియమించుకోనున్న టాటా టెక్నాలజీస్!

by Disha Web Desk 17 |
1,000 మంది మహిళా ఇంజనీర్లను నియమించుకోనున్న టాటా టెక్నాలజీస్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది మహిళా ఇంజనీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా ఉన్నట్టు గ్లోబల్ ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ టాటా టెక్నాలజీస్ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఇంజనీరింగ్ విభాగంలో చేరేందుకు మహిళలను ప్రోత్సహిస్తూనే సంస్థలో లింగ వైవిధ్యాన్ని కలిగి ఉండాలని భావిస్తున్నట్టు తెలిపింది.

'రెయిన్‌బో' కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది మహిళలను ఆన్‌బోర్డింగ్ చేయడం, వారి వృత్తి జీవితంలో విజయం సాధించేలా నిర్మాణాత్మక చర్యలు రూపొందించడంపై కంపెనీ దృష్టి సారించిందని కంపెనీ వివరించింది. కంపెనీలో మహిళల సంఖ్యను పెంచేందుకు, వారికి నిర్దిష్టమైన అవకాశాలను అందించే లక్ష్యాలను కలిగి ఉన్నాం. అంతేకాకుండా టాటా టెక్నాలజీస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని, కొత్త తరం ఉద్యోగులను రూపొందించే అనుకూలమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది.


Next Story

Most Viewed