- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tata Steel: హైడ్రోజన్ సరఫరా పైపులను తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిలిచిన టాటా స్టీల్
ఈ మైలురాయితో టాటా స్టీల్ దేశీయ క్లీన్ ఎనర్జీ లక్ష్యాల్లో కీలక దశను అధిగమించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను రూపొందించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ఈ మైలురాయితో టాటా స్టీల్ దేశీయ క్లీన్ ఎనర్జీ లక్ష్యాల్లో కీలక దశను అధిగమించింది. ఈ హైడ్రోజన్-సహిత ఏపీఐ ఎక్స్65 పైపులను కంపెనీకి చెందిన మహారాష్ట్రలోని ఖోపొలి ప్లాంటులో ప్రాసెస్ చేశారు. ఇందులో వాటిన ఉక్కుని ఒడిశాలో ఉత్పత్తి చేశారు. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ పైపులు హైడ్రోజన్ సరఫరా కోసం కావాల్సిన అన్ని అవసరాలకు అనుగుణంగా తయారు చేసినట్టు స్పష్టం చేసింది. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. హాట్-రోల్డ్ స్టీల్ నుంచి డిజైన్, తయారీ నుంచి పైపుల ఉత్పత్తి వరకు టాటా స్టీల్ కంపెనీయే నిర్వహించింది. ఈ పైపులకు సంబంధించి అర్హత పరీక్షలను హైడ్రోజన్ సంబంధిత పరీక్షలు, ధృవీకరణలో అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఇటలీలోని రినా-సీఎస్ఎం ఎస్.పీ.ఏలో నిర్వహించామని కంపెనీ పేర్కొంది. వీటి తయారీతో భారత జాతీయ హైడ్రోజన్ మిషన్‌కు మద్దతు లభిస్తుందని, ఇవి అధిక పీడనం వద్ద 100 శాతం స్వచ్ఛమైన వాయు హైడ్రోజన్‌ను రవాణా చేయగలవని వెల్లడించింది.






