Tata: టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ మూడవ టర్మ్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసిన బోర్డు

by S Gopi |

మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశం గురించి చంద్రశేఖరన్ స్వయంగా వాయిదా వేయాలని కోరినట్టు తెలుస్తోంది.

Tata: టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ మూడవ టర్మ్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసిన బోర్డు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా సన్స్ ఛైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్‌ను మూడవసారి చైర్మన్‌గా కొనసాగించే నిర్ణయాన్ని టాటా సన్స్ బోర్డు మంగళవారం వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలో నెలకొన్న విభేదాలను సూచిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రెండో టర్మ్ పదవీకాలం 2027, ఫిబ్రవరిలో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని పొడిగించడంపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జాతీయ మీడియా తెలిపింది. అయితే, మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశం గురించి చంద్రశేఖరన్ స్వయంగా వాయిదా వేయాలని కోరినట్టు తెలుస్తోంది. బోర్డు సమావేశంలో సభ్యులు ఆయన కొనసాగాలని మద్దతివ్వగా, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా ఉన్న నోయల్ టాటా అభ్యంతరాలు తెలిపారూ. కొత్త వ్యాపారాల విషయంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నాయని, దీనికితోడు చంద్రశేఖరన్ పునర్నియామకంపై ఆయన సందేహాలు వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా టాటా సన్స్ లిస్టింగ్‌కి వెళ్లకపోవడం, రిస్క్ ఉన్న పెట్టుబడులకు సంస్థ దూరంగా ఉండటం, అప్పులు, ఎయిర్ఇండియా అప్పులను తగ్గించడం వంటి అంశాలను నోయల్ టాటా లేవనెత్తినట్టు సమాచారం. దీంతో కొందరు సభ్యులు ఓటింగ్ ప్రతిపాదన చేయగా, చంద్రశేఖరన్ ప్రస్తుతానికి ఈ అంశాన్ని వాయిదా వేయాలని కోరారు.

Next Story