- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata Sierra: రూ. 11.49 లక్షలతో మార్కెట్లోకి టాటా సియెరా
డెలివరీలు కొత్త ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ సియెరాను తిరిగి మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలుగా నిర్ణయించామని చెప్పిన కంపెనీ, కొత్త మోడల్ కోసం బుకింగ్‌లు డిసెంబర్ 16 నుంచి మొదలవుతాయని, కంపెనీ డీలర్‌షిప్‌ల వద్ద లేదంటే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. డెలివరీలు కొత్త ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. తొలిసారిగా 1991లో వాహన రంగంలోకి వచ్చిన సియెరా మోడల్ కారును 2003లో నిలిపేశారు. మళ్లీ 20 ఏళ్లకు పైగా విరామం తర్వాత టాటా ఈ కారును 'రీ-బర్త్ ఆఫ్ ఎ లెజెండ్'గా తీసుకొచ్చింది. డిజైన్ పరంగా పాత కారును తలపించేలా చూసుకున్న టాటా, 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమెటిక్, మాన్యూవల్ ఆప్షన్లలో లభిస్తుంది. బెంగాల్ రూజ్ (ఎరుపు), అండమాన్ అడ్వెంచర్ (పసుపు), కూర్గ్ క్లౌడ్స్ (సిల్వర్), మున్నార్ మిస్ట్ (గ్రీన్), మింటల్ గ్రే, ప్రిస్టైన్ వైట్ మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పానరోమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. లెవెల్-2 అడాస్‌తో వస్తుండటంతో 20 కంటే ఎక్కువ భద్రతాపరమైన ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.






