- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata Motors: సఫారీ, హ్యారియర్ మోడల్స్‌లో పెట్రోల్ వెర్షన్ విడుదల చేసిన టాటా మోటార్స్
సఫారీతో టాటా ఫ్లాగ్‌షిప్ మూడు-వరుసల ఎస్‌యూవీ విభాగంలో పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ని అందిస్తున్న మొదటి కంపెనీగా నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలోని ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన సఫారీ, హ్యారియర్ మోడల్స్‌లో పెట్రోల్ వేరియంట్లను లాంచ్ చేసింది. సఫారీతో టాటా ఫ్లాగ్‌షిప్ మూడు-వరుసల ఎస్‌యూవీ విభాగంలో పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ని అందిస్తున్న మొదటి కంపెనీగా నిలిచింది. సఫారీ మోడల్‌కు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి సమాచారం త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ ఎస్‌యూవీ 1.5 లీటర్ టర్బోఛార్జ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. 168బీహెచ్‌పీ, 280 టార్క్‌తో లభించే ఈ మోడల్ మాన్యూవల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుందనే అంచనాలున్నాయి. ధరలకు సంబంధించి పెట్రోల్ వేరియంట్ కంటే తక్కువకే లభిస్తుందని సమాచారం. హ్యారియర్ పెట్రోల్ వేరియంట్ టర్బోఛార్జ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. సిటీ డ్రైవింగ్‌ను ఇష్టపడే ప్రయాణీకులకు హ్యారియర్ మొదటి ఎంపికగా అవుతుందని కంపెనీ భావిస్తోంది. దీన్ని హైపెరియన్ పవర్‌ట్రెయిన్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేశారు. డీజిల్ వేరియంట్ స్థాయిలో ఇది 167.7 హెచ్‌పీ, 280 పీక్ టార్క్ అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యూవల్‌తో పాటు ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఎస్‌యూవీ లీటర్‌కు 12-14 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, ధర రూ. 15 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని టాటా మోటార్స్ వెల్లడించింది. ఇది డీజిల్ వేరియంట్ కంటే రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు చౌక ధరకే లభిస్తోంది.






