2022 లో కొత్త మోడళ్లపై దృష్టి సారిస్తున్న టాటా మోటార్స్!

by Web Desk |
2022 లో కొత్త మోడళ్లపై దృష్టి సారిస్తున్న టాటా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాదిలో వృద్ధి ఊపందుకుంటుందని, సరఫరాలో ఉన్న సమస్యలు మెరుగుపడతాయని అంచనా వేస్తోంది. దీనివల్ల డిమాండ్ తీర్చేందుకు ఎక్కువ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు వీలవుతుందని కంపెనీ పేర్కొంది. గత నెలలో ప్యాసింజర్ వాహనాల విభాగంలో అమ్మకాలు 50 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో ఇప్పుడున్న సవాళ్లు అధిగమించి ఎక్కువ విక్రయాలను సాధించగలమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో ఒక్క మోడల్‌కు ఏడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని, ఇది వృద్ధిని దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రకారం మరిన్ని కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం. గతేడాది ఎస్‌యూవీ విభాగంలో పంచ్ మోడల్‌ను ఎంట్రీ లెవెల్‌గా తీసుకొచ్చాం, ఈ విభాగంలో మరిన్ని కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని శైలేష్ చంద్ర వివరించారు. ఇటీవల కంపెనీ ఎస్‌యూవీ, సీఎన్‌జీ వేరియంట్లలో వాహనాలను తీసుకొస్తున్నా, అలాగే ఇటీవల పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల పై దృష్టి సారించాం. అంతేకాకుండా రాబోయే సంవత్సరాల్లో ప్రతి ఏటా ఇప్పుడున్న మోడళ్లలోనే మెరుగైన వెర్షన్‌లతో పాటు కొత్త వినియోగదారుల కొసం మోడళ్లను తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed