- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెలికాం రంగంలోకి టాటా ఎంట్రీ... సహభాగస్వామిగా బీఎస్ఎన్ఎల్
అతి తక్కువ ధరలకే ఉచిత నిమిషాలను అందించే టెలికాం దిగ్గజం టాటా ఇండికాం మీకు గుర్తుండే ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: అతి తక్కువ ధరలకే ఉచిత నిమిషాలను అందించే టెలికాం దిగ్గజం టాటా ఇండికాం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు, బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో టెలికాం రంగంలోకి దూసుకొస్తోంది. ఈ ఆకస్మిక భాగస్వామ్యం మిగిలిన ఇతర టెలికాం కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది. ఇంకా వినియోగదారుల ప్రయోజనాలపైన కూడా దృష్టి పెట్టింది.
ఇటీవలే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) బీఎస్ఎన్ఎల్(BSNL) లో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. దీంతో పాటుగా డేటా సెంటర్ల ఏర్పాటు పైన దృష్టి పెట్టింది. బీఎస్ఎన్ఎల్ లో ఈ పెట్టుబడి ప్రధానమైన నాలుగు కీలక రంగాలలో గరిష్ట వృద్ధిని సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. భవిష్యత్ లో ఈ వ్యూహాత్మక పెట్టుబడి తో అధిక లాభాలను అందించే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ మరియు టాటా మధ్య భాగస్వామ్యం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే... ఇది గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ని అందించడమే.!
ప్రణాళిక ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 1000 గ్రామాల్లో 4G పరీక్షను ప్రారంభించి వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ గ్రామాలకు కేవలం 3G సేవలు మాత్రమే అందేవి. ప్రస్తుతం 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి.అయితే వీరిరువురి భాగస్వామ్యంతో... టాటా, బీఎస్ఎన్ఎల్ ను కొనుగోలు చేయబోతుందనే పుకార్లు సోషల్ మీడియా లో వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి టాటా బీఎస్ఎన్ఎల్ లో కేవలం వ్యూహాత్మక పెట్టుబడులను మాత్రమే పెట్టింది. దానిని కొనుగోలు చేయలేదు.
జూలై నెల ప్రారంభంలో ఎయిర్ టెల్, జియో మరియు వొడాఫోన్ లు తమ రీఛార్జ్ ధరలను అధికంగా పెంచటంతో, వినియోగ దారులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా చాలా మంది తమ యొక్క నంబర్లను, తక్కువ ధరకే రీఛార్జ్ సేవలను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు 5G నెట్‌వర్క్‌లోకి అడుగుపెట్టడానికి సంసిద్ధమవుతోంది. దీనికి సంబందించిన ట్రయల్ మాత్రం మొదటగా ప్రధాన నగరాల్లో ప్రారంభమవుతుంది. తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరింపజేస్తామని తెలిపారు.సమీప భవిష్యత్ లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో టాటా మరియు బీఎస్ఎన్ఎల్ మధ్య భాగస్వామ్యం, టెలికాం రంగంలో మెరుగైన కనెక్టివిటీతో విప్లవాత్మక మార్పులు చేస్తుందని తెలుస్తోంది.






