- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెజాన్‌కు రాఖీ తెచ్చిన తంటా.. షాకిచ్చిన వినియోగదారుల ఫోరం
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాకిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు (Amazon) వినియోగదారుల ఫోరం గట్టి షాకిచ్చింది. తీసుకున్న ఆర్డర్‌ను సకాలంలో డెలివరీ చేయటంలో విఫలమైనందుకు గానూ ఆ సంస్థకు భారీ జరిమానా (Fine) విధించింది. వివరాల్లోకి వెళ్లితే.. ముంబైకి (Mumbai) చెందిన ఓ మహిళ తన మేనల్లుడి కోసం 2019 ఆగస్టు 2న అమెజాన్ వెబ్‌సైట్‌లో ధనశ్రీ రాఖీ షాపు నుంచి రూ.100 విలువ చేసే మోటూ పట్లూ కిడ్స్ రాఖీని (Rakhi) ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన అమెజాన్.. ఆగస్టు 8వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య డెలివరీ అందజేస్తామంటూ మెసేజ్ పంపింది.
అయితే, చెప్పిన తేదీల్లో రాఖీ డెలివరీ చేయకపోగా.. మరుసటి రోజే రాఖీ కోసం చెల్లించిన రూ.100 ఆమె బ్యాంకు ఖాతాలో తిరిగి జమ చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు మహిళ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును విచారించిన ముంబై జిల్లా వినియోగదారుల ఫోరం (Consumer forum) అధ్యక్షుడు సమీందర్ ఆర్.సుర్వే, సభ్యుడు సమీర్ కె.కాంబ్లేతో కూడిన ధర్మాసనం అమెజాన్ వైఖరిని తప్పుబట్టింది. రూ.100 విలువైన రాఖీని ఆర్డర్ తీసుకున్న అమెజాన్ దాన్ని సకాలంలో అందజేయకపోగా, మరుసటి రోజున దాన్ని కాన్సిల్ చేయటం తీవ్రమైన సేవా లోపంగా పరిగణించింది. ఈ మేరకు ఫోరం అమెజాన్ సంస్థ బాధితురాలికి రూ.40,000 జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






