Starlink: శాటిలైట్ ఇంటర్నెట్ తుది అనుమతులపై స్టార్‌లింక్ స్పందన

by S Gopi |

ఇప్పటికే దేశంలో బిజినెస్ చేయడానికి కావలసిన ప్రాథమిక లైసెన్సులు పొందడంతో పాటు, క్షేత్రస్థాయి సాంకేతిక ఏర్పాట్లను (గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కూడా స్టార్‌లింక్ పూర్తి చేసింది.

Starlink: శాటిలైట్ ఇంటర్నెట్ తుది అనుమతులపై స్టార్‌లింక్ స్పందన
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు బ్రేక్ పడిందని వస్తున్న ఊహాగానాలను స్టార్‌లింక్ ఖండించింది. భారత ప్రభుత్వంతో తమ చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని, ఇండియాలో హైస్పీడ్ ఇంటర్నెట్ విప్లవం తెచ్చేందుకు తాము కీలక దశకు చేరుకున్నామని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో బిజినెస్ చేయడానికి కావలసిన ప్రాథమిక లైసెన్సులు పొందడంతో పాటు, క్షేత్రస్థాయి సాంకేతిక ఏర్పాట్లను (గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కూడా స్టార్‌లింక్ పూర్తి చేసింది. ముఖ్యంగా నెట్ సిగ్నల్స్ సరిగ్గా అందని మారుమూల గ్రామాలు, అడవులు, కొండ ప్రాంతాలకు సైతం శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే తమ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ప్రోత్సాహకరమైన రెస్పాన్స్ లభించిందని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దేశ రక్షణ, భద్రతా నిబంధనల విషయంలో భారత్ పెట్టిన కఠినమైన రూల్స్ అన్నింటికీ తాము కట్టుబడి ఉన్నామని స్టార్‌లింక్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సరికొత్త ఆపరేటింగ్ మోడల్‌ను కూడా కంపెనీ డిజైన్ చేసింది. దీని ప్రకారం.. భారతీయ కస్టమర్ల ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ మొత్తం విదేశీ సర్వర్లకు వెళ్లకుండా, కేవలం మన దేశంలో ఏర్పాటు చేసిన లోకల్ హబ్స్ ద్వారానే రన్ అవుతుంది.

Next Story