జియోస్టార్‌కు యాడ్స్ పండగ.. 10సెకన్ల యాడ్ కు ఏకంగా రూ.60 లక్షలు

by Naga Rani Yarlagadda |

టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఘన విజయం సాధించడంతో.. జియోస్టార్ లో యాడ్స్ కు డిమాండ్ పెరిగింది.

జియోస్టార్‌కు యాడ్స్ పండగ.. 10సెకన్ల యాడ్ కు ఏకంగా రూ.60 లక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో : టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై భారీ విజయం సాధించి టోర్నీని కైవసం చేసుకున్నది. కాగా బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు యాడ్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌కు ఉన్న ఆదరణను చూసే కోట్లాది కస్టమర్లను చేరేందుకు బ్రాండ్ల మధ్య పోటీ తీవ్రం కావడంతో యాడ్స్‌కు ఈ స్థాయి ధర పలికింది. టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువమంది యూజర్లను ఆకర్షించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. దీనికోసం ప్రీమియం రేట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్టు స్పష్టం చేస్తున్నాయి. మ్యాచ్ సమయంలో పరిమిత యాడ్ స్లాట్‌లు ఉండటంతో కంపెనీలు పోటీ పడి మరీ యాడ్స్ కోసం ప్రయత్నించాయి. అయితే ఇటీవల ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ సమయంలో వచ్చిన వ్యూస్ కూడా ఈ డిమాండ్‌ను ప్రభావితం చేశాయి. సెమీ ఫైనల్ జరిగిన సమయంలో జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 6.52 కోట భారీ వ్యూస్ వచ్చాయి. ఇది లైవ్ ఈవెంట్‌కు వచ్చిన రికార్డు వ్యూస్ కావడంతో ఫైనల్ మ్యాచ్ స్లాట్‌లకు మరింతగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వినియోగ వస్తువులు, టెక్, ఫైనాన్స్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన కంపెనీల నుంచి భారీ ప్రకటనలు వచ్చినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Next Story