- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: బ్యాంకు అకౌంట్ పోర్టబిలిటీ తెచ్చే యోచనలో ఆర్‌బీఐ
అంటే, వేరే బ్యాంకుకు మారినప్పటికీ అదే అకౌంట్ నంబర్‌ను కొనసాగించవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు తమ బ్యాంకు ఖాతా నంబర్‌ను మార్చకుండానే బ్యాంకులను మారడానికి అనుమతించే కీలక ప్రతిపాదనపై ఆర్‌బీఐ పనిచేస్తోంది. ప్రతిపాదిత 'పేమెంట్స్ విజన్ 2028' ప్రకారం, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ మాదిరిగానే వినియోగదారులు త్వరలో తమ బ్యాంక్ ఖాతాలను పోర్ట్ చేసుకోవచ్చు. అంటే, వేరే బ్యాంకుకు మారినప్పటికీ అదే అకౌంట్ నంబర్‌ను కొనసాగించవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు అందించే సేవల్లో ఇబ్బందులు, అధిక ఛార్జీలు ఉన్నప్పటికీ చాలా మంది ఒకే బ్యాంకుతో కొనసాగుతున్నారు. ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ అమలైతే, ఈఎంఐలు, సిప్‌లు, బిల్లులు వంటి చెల్లింపులకు ఎలాంటి అంతరాయం లేకుండా, బ్యాంకులను మారడం సిమ్ కార్డు మార్చినంత సులభం అవుతుంది.
బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ అంటే?
ప్రస్తుతం, బ్యాంక్ ఖాతాను మార్చడం చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. వినియోగదారులు తమ కొత్త అకౌంట్ నంబర్‌ను శాలరీ, పెట్టుబడులు, సబ్‌స్క్రిప్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అదే, ఆర్‌బీఐ ప్రతిపాదించిన విధంగా బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ ఈ సమస్యను తొలగిస్తుంది. దీనివల్ల బ్యాంకు అకౌంట్ నంబర్ ఒక యూనివర్శల్ ఫైనాన్షియల్ ఐడెంటిటీగా పనిచేస్తుంది. ఒకే బ్యాంకుకు పరిమితమి ఉండదు. అకౌంట్ నంబర్ మార్చకుండానే మరొక బ్యాంకుకు మారవచ్చు. కొత్త బ్యాంకు ప్రస్తుత అకౌంట్ నంబర్‌ను తమ సిస్టమ్‌లో యాక్టివేట్ చేస్తుంది.






