ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న Swiggy !

by Dishanational4 |
ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న Swiggy !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఉద్యోగుల తొలగింపు చేస్తున్న టెక్ కంపెనీల జాబితాలో స్విగ్గీ సైతం చేరనుంది. డిసెంబర్‌ నెలలో ఉద్యోగులను 3 నుండి 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. నివేదికల ప్రకారం.. 250 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. కస్టమర్ సేవ, ఇంజినీరింగ్, ఉత్పత్తి కార్యకలాపాలలో తొలగింపులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై స్విగ్గీ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే పోటీదారు సంస్థ అయిన జొమాటో నవంబర్ నెలలో వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందిని తొలగించింది. అంతేకాకుండా అమెజాన్, మెటా, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించాయి.


Next Story

Most Viewed