- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాన్యువల్ ఆర్డర్ అనాలసిస్.. కండోమ్ ల కోసం రూ.లక్ష
ప్రముఖ ఫుడ్ అండ్ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్ స్టామార్ట్ యాన్యువల్ ఆర్డర్ అనాలసిస్ 2025ను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ అండ్ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్ స్టామార్ట్ యాన్యువల్ ఆర్డర్ అనాలసిస్ 2025ను విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి. కరివేపాకు మొదలు.. గోల్డ్, కండోమ్స్, ఐఫోన్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు నివేదికలో స్విగ్గీ సంస్థ పేర్కొంది. బెంగళూరు చెందిన ఒక వ్యక్తి కనిష్ఠంగా రూ.10 ఖర్చుతో ప్రింటవుట్స్ తెప్పించుకోగా.. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ కోసం రూ.4.3 లక్షలు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక మరో వ్యక్తి ఇన్ స్టామార్ట్ లో ఈ ఏడాది ఏకంగా రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు స్విగ్గీ నివేదికలో తెలిపింది. ముంబైకి చెందిన వ్యక్తి రూ.15.16 లక్షల విలువైన గోల్డ్ ను కొనగా.. చెన్నైకి చెందిన వ్యక్తి కండోమ్ ల కోసం అక్షరాలా లక్షరూపాయలు ఖర్చు చేసినట్లు రిపోర్ట్ చెబుతోంది.
రాజ్ కోట్ లో ఇన్ స్టామార్ట్ వినియోగం 10 రెట్లు డెవలప్ అవ్వగా.. లుథియానాలో 7 రెట్లు, భువనేశ్వర్లో4 రెట్ల వినియోగం పెరిగింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా స్విగ్గీ ఇన్ స్టామార్ట్ లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల లిస్టులో కరివేపాకు టాప్ ప్లేస్ లో ఉండటం గమనార్హం. కొచ్చికి చెందిన వ్యక్తి 368 సార్లు అంటే.. సగటున రోజుకి ఒకసారి కరివేపాకును ఆర్డర్ చేశాడు. పాలు, పెరుగు, ఎగ్స్, అరటిపండ్లు వంటి వాటిని ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు నివేదిక పేర్కొంది. మరో విశేషం ఏంటంటే.. బెంగళూరుకు చెందిన వ్యక్తి.. డెలివరీ బాయ్ కు ఏకంగా రూ.68,600 టిప్ గా చెల్లించి షాకయ్యేలా చేశాడు.






