Swiggy : సిగ్గీలో ఆ సేవలు బంద్

by Naga Rani Yarlagadda |

70 సిటీల్లో ఈ సర్వీస్ అందుబాటులోకి రాగా.. కొద్దిరోజులుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో స్విగ్గీ యాప్ లో జీనీ సేవలు కనిపించడం లేదు.

Swiggy : సిగ్గీలో ఆ సేవలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: వస్తువులు పికప్ అండ్ డ్రాపింగ్ కోసం తీసుకొచ్చిన స్విగ్గీ జీనీ సేవల్ని సిగ్గీ సంస్థ నిలిపివేసింది. 70 సిటీల్లో ఈ సర్వీస్ అందుబాటులోకి రాగా.. కొద్దిరోజులుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో స్విగ్గీ యాప్ లో జీనీ సేవలు కనిపించడం లేదు. సర్వీస్ అందుబాటులో లేకపోవడంపై ఓ నెటిజన్ స్విగ్గీని సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో అందుకు బదులిస్తూ.. తాత్కాలికంగా జీనీ సేవల్ని ఆపివేసినట్లు తెలిపింది.

అయితే మళ్లీ స్విగ్గీ జీనీ సేవల్ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారు? స్పెసిఫిక్ సిటీల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయా? అన్న విషయాలపై స్విగ్గీ స్పష్టత ఇవ్వలేదు. వస్తువుల పికప్ అండ్ డ్రాప్ కోసం 2020 ఏప్రిల్ లో స్విగ్గీ ఈ సేవల్ని ప్రారంభించి.. 70 సిటీల్లో విస్తరించింది. ఇక ఇటీవలే స్విగ్గీ 10 మినిట్స్ లో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొంటూ.. బోల్ట్ ను పరిచయం చేసింది. ప్రస్తుతం 500కు పైగా నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

Next Story