- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్విఫ్ట్ కార్లు కొనేవారికి బంపర్ ఆఫర్...ఒక్కో కారుపై ఎంత డిస్కౌంట్ అంటే!
తగ్గింపు ప్రకారం ఒక్కో కారుపై.. 55000 నుంచి లక్ష రూపాయల వరకు ఉండనుంది. బేస్ మోడల్ ప్రకారం.. ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయ

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం అన్ని వస్తువులపై జిఎస్టి తగ్గించడంతో... సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించనుంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి. కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. అయితే జీఎస్టీ తగ్గింపు కార్లకు కూడా వర్తించనుంది. దీంతో తమ కార్ల ధరలు తగ్గిస్తున్నాయి కంపెనీలు. తాజాగా మారుతి సుజుకి కూడా... కార్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ తగ్గింపు ప్రకారం ఒక్కో కారుపై.. 55000 నుంచి లక్ష రూపాయల వరకు ఉండనుంది. బేస్ మోడల్ ప్రకారం.. ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. స్విఫ్ట్ బేస్ మోడల్ కారు ధర 5.94 లక్షలకు చేరింది.
ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే. ఇక మారుతి సుజుకి ఆల్టో k 10 మోడల్ పై ఏకంగా 53000 వరకు డిస్కౌంట్ రానుంది. ఇక ఆల్టో కార్ పై 28 వేల రూపాయల డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే ఈ కారును 3.87 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో టాప్ మోడల్ 5.36 లక్షలకు అందుబాటులో ఉంటుంది. ఎస్ ప్రెస్సో కారుపై 53 వేల రూపాయల వరకు గరిష్టంగా తగ్గనుంది. ఈ కారు 3.90 లక్షలకు ఎక్స్ షోరూం ప్రకారం రానుంది. సెలరియో ఫై 63 వేల రూపాయలు తగ్గింపు ఉంటుంది. వాగన్ R కారు ధర 5.26 లక్షలకు చేరింది. డిజైర్ 6.24 లక్షలకు తగ్గింది. ఈ కొత్త ధరలన్నీ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.






