- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rare Earth Elements: చైనా ఎఫెక్ట్.. స్విఫ్ట్ మోడల్ కార్ల ఉత్పత్తి ఆపేసిన సుజుకి
జూన్ 16 తర్వాత పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: చైనా అరుదైన భూ అంతర్భాగంలో లభించే ఖనిజాలపై ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలు ప్రభావితమవుతున్నాయి. ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ తాజాగా స్విఫ్ట్ మోడల్ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో చైనా ఎగుమతుల ఆంక్షల కారణంగా ప్రభావితమైన మొదటి జపనీస్ వాహన తయారీ సంస్థగా సుజుకి నిలిచింది. అరుదైన మూలకాలు లేకపోవడం, విడిభాగాల కొరత కారణంగా మే 26 నుంచి జూన్ 6 వరకు స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ మినహా స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలం, జూన్ 13న సాగర ప్లాంట్‌లో స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని పాక్షికంగా పునఃప్రారంభిస్తామని, జూన్ 16 తర్వాత పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించాయి. చైనా ఆంక్షల నిర్ణయంతో పలు విభాగాల్లో సరఫరా దెబ్బతిన్నదని గురువారం ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినియోగంలో ఉన్న అరుదైన మూలకాలు, అయస్కాంత ఎగుమతులను నిలిపేయాలని ఏప్రిల్‌లో చైనా నిర్ణయం తీసుకుంది. వీటిని అంతర్జాతీయంగా ఉన్న వాహన తయారీదారులు, ఏరోస్పేస్, సెమీకండక్టర్, రక్షణ వ్యవస్థలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చైనా నిర్ణయంతో ఇప్పటికే కొన్ని యూరప్‌లో ఆటో విడిభాగాల ప్లాంట్లు మూతబడ్డాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ కూడా అరుదైన ఖనిజాల కొరత నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.






