- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sun Pharma: అమెరికా ఆర్గానన్‌ను కొనుగోలు చేయనున్న సన్‌ఫార్మా
ఇది భారత ఫార్మా రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విదేశీ కొనుగోళ్లలో ఒకటిగా భావిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఔషధ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ దేశ ఫార్మా రంగంలోనే అతిపెద్ద విదేశీ కొనుగోలు చేపట్టనుంది. అమెరికాకు చెందిన ఆర్గానన్ & కో.ను సుమారు 12.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.18 లక్షల కోట్ల)కు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇది భారత ఫార్మా రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విదేశీ కొనుగోళ్లలో ఒకటిగా భావిస్తున్నారు. అంతేకాకుండా, 2007 ఏప్రిల్‌లో కోరస్ కంపెనీని టాటా స్టీల్ స్వాధీనం చేసుకున్న తర్వాత, ఒక భారతీయ కంపెనీ చేసే అతిపెద్ద విదేశీ కొనుగోలు కూడా ఇదే అవుతుంది. ఈ ఒప్పందానికి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ డీల్‌లో ఆర్గానన్ కంపెనీ ఈక్విటీ కోసం సన్‌ఫార్మా సుమారు 4.5 బిలియన్ డాలర్లు(రూ. 42.41 వేల కోట్లు) చెల్లించనుంది. అలాగే, ఆర్గానన్ కంపెనీకి ఉన్న సుమారు 8.5 బిలియన్ డాలర్ల(రూ. 80.11 వేల కోట్ల) అప్పును కూడా సన్‌ఫార్మా భరించాల్సి ఉంటుంది. ఈ కొనుగోలుకు బడా బ్యాంకుల ఆర్థిక సహాయం అందించనున్నాయి. ఈ ఒప్పందంతో మహిళల ఆరోగ్యం, బయోసిమిలర్ ఔషధాల రంగాల్లో సన్‌ఫార్మా పట్టు సాధించనుంది. ఆర్గానన్ కంపెనీని కొనుగోలు చేయడం ఇప్పటికే అమెరికాలో మెరుగైన అమ్మకాలు సాధిస్తున్న సన్‌ఫార్మా, తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి.






