- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bonds vs Stocks: స్టాక్స్ vs బాండ్లు..ఈ రెండింటిలో ఏది బెస్ట్..?
Bonds vs Stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది కాస్త రిస్క్ తో కూడిన వ్యవహారం అయినప్పటికీ, అధ్యయనము అదేవిధంగా మార్కెట్ పట్ల అవగాహన పెంచుకొని, నిపుణుల సలహాలు పాటిస్తూ ముందుకు వెళితే దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Bonds vs Stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది కాస్త రిస్క్ తో కూడిన వ్యవహారం అయినప్పటికీ, అధ్యయనము అదేవిధంగా మార్కెట్ పట్ల అవగాహన పెంచుకొని, నిపుణుల సలహాలు పాటిస్తూ ముందుకు వెళితే దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేవి రిస్క్ వ్యవహారం అని చెప్పవచ్చు ముఖ్యంగా అంతర్జాతీయ జాతీయ పరిణామాలు వీటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీంతోపాటు స్టాక్ మార్కెట్ కు బదులుగా బాండ్ మార్కెట్ కూడా ఉంటుంది.
వీటిని కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు కూడా విడుదల చేస్తూ ఉంటాయి ఈ బాండ్ల విలువ అనేది ఆ సంస్థల పెర్ఫార్మన్స్ ను బట్టి ఉంటుంది. ఇండియన్ బాండ్ మార్కెట్లో కూడా కనిపిస్తోంది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ 2.69 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించింది. ముఖ్యంగా SEBI రూల్స్ మార్చడంతో ఈ సారి బాండ్ మార్కెట్లో చక్కటి పెర్ఫార్మెన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ బాండ్ల ఫేస్ వాల్యూను రూ. 10 లక్షల నుంచి రూ. 10,000కి తగ్గించడం ద్వారా చిన్న పెట్టుబడిదారులు కూడా బాండ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం సులభంగా మారింది. మరోవైపు గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారత్ ఎంట్రీ ఇవ్వడంతో JP Morgan, Bloomberg, FTSE Russell లాంటి గ్లోబల్ ఇండెక్స్‌లలో భారత్ బాండ్ మార్కెట్ లోకి విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడం ప్రారంభించాయి.
అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే మాత్రం బాండ్లపై వడ్డీ ధర తగ్గుతుంది తద్వారా తక్కువ ఆదాయం లభిస్తుంది. ఆదాయాన్ని బట్టి భేరేజు వేసుకున్నట్లయితే బాండ్లు స్థిరమైన ఆదాయం అందిస్తాయి AAA రేటింగ్ ఉన్న బాండ్లు ఏడు నుంచి ఎనిమిది శాతం రాబడి అందిస్తాయి. అదే స్టాక్ మార్కెట్లో అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో అధిక రాబడి కూడా లభించే అవకాశం ఉంటుంది.
సాధారణంగా బాండ్లు మూడు రకాలుగా ఉంటాయి షార్ట్ టెర్మ్ (0-3 Yrs): వీటిలో ప్రధానంగా AAA షార్ట్ టెర్మ్ బాండ్లు ముఖ్యమైనవి, అలాగే రెండోది మిడ్ టెర్మ్ (3-7 Yrs): బాండ్లు, స్టాక్స్ మిక్స్ అయి ఉంటాయి. లాంగ్ టెర్మ్ 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఉంటాయి.
బాండ్లకు కొన్ని ఉదాహరణలు చూస్తే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ – 7.95%, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా – 9.35%, కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ – 8.89% వంటివి ప్రస్తుతం స్థిరంగా రాబడి అందిస్తున్న బాండ్లుగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే మీ పెట్టుబడులపై సర్టిఫైడ్ బిజినెస్ కన్సల్టెంట్ నిపుణుల సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అని సూచన.






