Stock Markets: ఇన్వెస్టర్లకు ఊహించని షాక్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-28 08:16:53  IST  )

ఇన్వెస్టర్ల (Investors)కు బిగ్ షాక్ తగిలింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) సూచీలు శుక్రవారం భారీగా పతనమయ్యాయి.

Stock Markets: ఇన్వెస్టర్లకు ఊహించని షాక్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డస్క్: ఇన్వెస్టర్ల (Investors)కు బిగ్ షాక్ తగిలింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) సూచీలు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఏకంగా సెన్సెక్స్ (Sensex) 1,439 పాయింట్లకుపైగా పడిపోయింది. మరోవైపు 431 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ (Nifty) కొనసాగుతోంది. దీంతో ఒక్కరోజే 18 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లుగా ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అయితే ఐటీ (IT), టెక్నాలజీ (Technology), ఫార్మా (Pharma) షేర్లలో ఫారెన్ ఇన్వెస్టర్లు (Foreign Investors) అమ్మకాలను కొనసాగిస్తున్నారు. 30 సంవత్సరాల్లో వరుస నష్టాల రికార్డును స్టాక్ మార్కెట్ మూటగట్టుకుంది. మిడ్-క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి పడిపోగా.. అమ్మకాల్లో భారీ ఒత్తిడికి గురయ్యాయి. ఇక నిఫ్టీలో టాటా స్టీల్ (Tata Steel), టెక్ మహీంద్రా (Tech Mahindra), జియో ఫైనాన్షియల్ (Jio Financial), ఎన్‌టిపిసి (NTPC), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel) అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు కోల్ ఇండియా అత్యధికంగా లాభపడగా.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ దాదాపు 2.5 శాతం వరకు పెరిగింది.

Next Story