Stock Market: భారత్ -పాకిస్తాన్ టెన్షన్.. సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లు డౌన్

by Vennela |

Stock Market: భారత్ -పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏప్రిల్ 25వ తేదీ, శుక్రవారం ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలతో ట్రేడింగ్ నడుస్తోంది.

Stock Market:  భారత్ -పాకిస్తాన్ టెన్షన్.. సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లు డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: Stock Market: భారత్ -పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏప్రిల్ 25వ తేదీ, శుక్రవారం ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలతో ట్రేడింగ్ నడుస్తోంది. ఈరోజు ఉదయం సెన్సెక్స్ 950 పాయింట్లు నష్టంతో ప్రారంభమైంది అయితే ప్రస్తుతం సెన్సెక్స్ రికవరీ బాట పట్టి 440 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ సూచి ప్రస్తుతం 160 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది.భారత పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయక పౌరులు 26 మంది మృతి చెందడంతో భారత్ దీనిపైన ఆగ్రహంతో ఉంది.

ముఖ్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఈ దాడి వల్ల కాశ్మీర్ లోని పర్యాటక రంగం పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా అటు అమెరికా ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. మధుపరులు వాణిజ్య పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భయంతో షేర్లను విక్రయిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో దాదాపు రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కూడా ఆవిరైపోయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 0.80 శాతం నష్టపోయింది.

ఇక సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ పీఎస్‌ఈ సూచీ (−2.08%), నిఫ్టీ ఫార్మా (−1.85%), నిఫ్టీ రియల్టీ (−1.96%) , నిఫ్టీ ఎనర్జీ (−1.71%) , నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 (−1.72%), నిఫ్టీ మెటల్ (−1.61%), నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ (−1.44%), నిఫ్టీ ఆటో (−1.19%) చొప్పున నష్టపోయాయి. ఇదిలా ఉంటే అటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మాత్రం సానుకూలమైనటువంటి సంకేతాలు లభిస్తున్నాయి. దీంతో ఐటీ స్టాక్స్ ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Next Story