స్వల్ప నష్టాల్లో సూచీలు!

by Disha Web Desk 17 |
స్వల్ప నష్టాల్లో సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఓ దశలో మెరుగైన ర్యాలీని చూశాయి. అయితే, మిడ్-సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో మార్కెట్లు లాభనష్టాల మధ్య కదలాడాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ల ధోరణితో పాటు దేశీయంగా ఎఫ్అండ్ఓ గడువు బుధవారంతో ముగియనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

అంతేకాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో మార్పుల నేపథ్యంలో అమ్మకాలకు మొగ్గు చూపారు. అలాగే, వచ్చే నెలలో జరగబోయే ఆర్‌బీఐ పాలసీ సమావేశం, ఈవారంలో విడుదల కానున్న అమెరికా కీలక డేటాపై దృష్టి సారించారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 40.14 పాయింట్లు నష్టపోయి 57,613 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 16,951 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు మాత్రమే సానుకూలంగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.16 వద్ద ఉంది.

Also Read...

అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి Activa125!


Next Story

Most Viewed