Stock Market: ఆగని స్టాక్ మార్కెట్ల పతనం

by S Gopi |

అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలై నెల రోజులు దాటిన నేపథ్యంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెరిగాయి.

Stock Market: ఆగని స్టాక్ మార్కెట్ల పతనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో మరోసారి భారీ నష్టాలు నమోదయ్యాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకు ముదురుతుండటం, చమురు ధరల ఆందోళనలు వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలై నెల రోజులు దాటిన నేపథ్యంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి. ప్రధానంగా అమెరికా ఇరాన్‌పై సైన్యంతో దాడులు చేసేందుకు సిద్ధమవడంతో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయనే భయాలు ఎక్కువయ్యాయి. ఇక, యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగితే గ్లోబల్ సప్లై దెబ్బతినడం, చమురు ధరలు ఇంకా పెరుగుతాయనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌కు మద్దతుగా హౌతీ రెబెల్ ఫ్రాక్సీలు యుద్ధంలోకి రావడంతో చమురు సరఫరాపై కొత్త భయాలు, ఎర్ర సముద్రంలోని నౌకలపై దాడి చేస్తారనే ఊహాగానాలు పుంజుకున్నాయి. ఈ క్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి సెషన్‌లో దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, ఆసియా మార్కెట్లలో నెలకొన్న బలహీన ధోరణులు కూడా నష్టాలను పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1635.67 పాయింట్లు పతనమై 71,947 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్లు క్షీణించి 22,331 వద్ద ముగిశాయి. ఫలితంగా మదుపర్ల సంపద సోమవారం ట్రేడింగ్‌లో ఒక్కరోజే దాదాపు రూ. 9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 412 లక్షల కోట్లకు చేరుకుంది.

Next Story