మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక పరిణామాలేమీ లేకపోవడంతో సూచీలు క్షీణించాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల పెంపుపై ఉండనుందనే సంకేతాలివ్వడంతో గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇదే సమయంలో ఇతర సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతాయనే ఊహాగానాలు, దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు పెరగడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 541.81 పాయింట్లు కుదేలై 59,806 వద్ద, నిఫ్టీ 164.80 పాయింట్లు పడిపోయి 17,589 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం మాత్రమే అత్యల్పంగా పుంజుకోగా, ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.05 వద్ద ఉంది.

Also Read...

మహిళల కోసం లోన్స్‌పై ప్రత్యేక రాయితీని ఇస్తున్న బ్యాంకులు ఇవే!


Next Story

Most Viewed