- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రికార్డు స్థాయి లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 81 వేల మార్కును దాటిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఉత్సాహంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్తగా రికార్డు స్థాయికి చేరాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఉత్సాహంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్తగా రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 943.52 పాయింట్లు లాభపడి, 81,666.46 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ (Nifty) 262.95 పాయింట్ల లాభంతో 25,088 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, నిఫ్టీ తొలిసారిగా 25,000 మార్కును అధిగమించి స్థిరపడటం విశేషం. దాదాపు ఇవాళ అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే పయనించాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. మార్కెట్ల పెరుగుదలతో ఇన్వెస్టర్ల సంపద కొన్ని లక్షల కోట్లు పెరిగింది. మొత్తానికి, బుల్ రన్ కొనసాగుతుండటంతో ట్రేడర్లలో నూతనోత్సహం నెలకొంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న ఆశలు, బలమైన త్రైమాసిక ఫలితాలు మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి.






