- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 600 పాయింట్లకు పైగా లాస్‌లో సెన్సెక్స్
అమెరికా (America) ఆర్థిక ఆందోళనలతో పాటు ట్రెజరీ దిగుబడి (Treasury Yield) పెరుగుదల కారణంగా ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడం, బ్యాంకింగ్ ఐటీ స్టాక్‌ల క్షీణత కారణంగా గురవారం భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America) ఆర్థిక ఆందోళనలతో పాటు ట్రెజరీ దిగుబడి (Treasury Yield) పెరుగుదల కారణంగా ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడం, బ్యాంకింగ్ ఐటీ స్టాక్‌ల క్షీణత కారణంగా గురవారం భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రోజు ప్రారంభంలోనే ఏకంగా 400 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉదయం 10.30 సమయంలో సెన్సెక్స్ 657 పాయింట్ల నష్టంతో 80,939 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా NIFTY 202 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆటుపోట్లను తట్టుకుని అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో బాటలో పయనిస్తున్నాయి. అదేవిధంగా టెక్ మహీంద్రా, PGCL, HCL టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, Nestle India, HUL, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.






