- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. సాయంత్రం నుంచి కమోడిటీ మార్కెట్ల పని
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ దేశీయ స్టాక్‌మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ దేశీయ స్టాక్‌మార్కెట్లకు సెలవు ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లలో ఈరోజు ఎటువంటి లావాదేవీలు జరగవు. దీంతో ఈక్విటీ, డెరివేటివ్స్, సెక్యూరిటీల లెండింగ్, బారోయింగ్ (SLB) విభాగాల్లో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఉదయం సెషన్ సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంటుంది. అయితే, సాయంత్రం 5 గంటల నుంచి యధావిధిగా ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా కరెన్సీ డెరివేటివ్స్ విభాగం కూడా నేడు పని చేయదు. తిరిగి రేపు ఉదయం నుంచి మార్కెట్లు యథావిధిగా పని చేస్తాయి.
Next Story






