Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. బ్యాంకింగ్, ఆటో షేర్లు ఢమాల్..!

by Maddikunta Saikiran |

దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారాన్ని నష్టాలతో స్టార్ట్ చేశాయి.

Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. బ్యాంకింగ్, ఆటో షేర్లు ఢమాల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారాన్ని నష్టాలతో స్టార్ట్ చేశాయి. ఈ రోజు మార్కెట్ ఉదయం లాభాలతో ప్రారంభం కాగా.. కాసేపటికే గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడంతో నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 78,637.58 పాయింట్ల వద్ద లాభాల్లో స్టార్ట్ అయ్యింది. ఇంట్రాడేలో 78,248 వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 450.94 పాయింట్ల నష్టంతో 78,248.13 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 168.50 పాయింట్లు క్షీణించి 23,664.90 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.98 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అమెరికన్ డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ. 85.52 వద్ద ముగిసింది.

లాభాల్లో ముగిసిన షేర్లు: సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, జొమాటో, HCL టెక్నాలజీస్

నష్టాల్లో ముగిసిన షేర్లు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్

Next Story