- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో, ఫైనాన్స్, మెటల్ రంగాలలో షేర్ల అమ్మకాలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ (America Federal Reserve) వడ్డీ రేట్లను నేడు ప్రకటించనుండడంతో బెంచ్ మార్క్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు నిఫ్టీ(Nifty)లోని అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 81,511.81 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభం అయ్యింది. ఇంట్రాడేలో 80,612.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 1064 పాయింట్ల నష్టంతో 80,684 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 322 పాయింట్లు తగ్గి 24,336 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.56 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.91 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ సూచీలో ఐటీసీ ఒక్కటే లాభాల్లో ముగియగా.. భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజికీ ప్రధానంగా నష్టపోయాయి.






