- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Stock Market: దూసుకెళ్తోన్న ‘బుల్’.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎలక్ట్రానిక్ వస్తువుల (Electronic Goods)పై సుంకం మినహాయింపులు ప్రకటించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు వారం రోజుల తరువాత మంగళవారం భారత స్టాక్ మార్కెట్ సూచీలతో పాటు నిఫ్టీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 1,547 పాయింట్లు లాభపడి 76,704 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (NIFTY) 463 పాయింట్ల లాభంతో 23,292 వద్ద ట్రేడ్ అవుతోంది. అదవిధంగా అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, ట్రెండ్ లిమిటెడ్, మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.
Next Story