Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1,302 పాయింట్లు పతనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-13 09:10:48  IST  )

సోమవారం ఉదయం ప్రారంభంలోనే దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Indices) నేడు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1,302 పాయింట్లు పతనం
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం ఉదయం ప్రారంభంలోనే దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Indices) నేడు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 1,302 పాయింట్లు నష్టపోయి 81,127 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ (NIFTY) 344 పాయింట్ల నష్టంతో 24,580 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఇన్ఫీ, ఎటర్నల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, HCL టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, TCS, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, HDFC బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్ వుతున్నాయి. సన్‌ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ షేర్లు స్వల్ప లాభాలతో ముందుకు సాగుతున్నాయి.

Next Story