Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 386 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

by Kema Shiva Kumar |

మంగళవారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 386 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా ఇన్వెస్టర్లు షేర్ల కొనగోళ్లలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 323 పాయింట్ల లాభంతో 81,482 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 133 పాయింట్ల లాభంతో 24,710 వద్ద కొనసాగుతోంది. ఇక టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ICICI బ్యాంక్‌, ఎటర్నల్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, SBI, HDFC బ్యాంక్‌, TCS షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో బాటలో పయనిస్తున్నాయి.

Next Story